జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జియో టవర్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని
By News Meter Telugu Published on 15 Jun 2023 10:32 AM GMTజియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జియో టవర్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందించేందుకు ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. వీటి ద్వారా 209 మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సిఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో రిలయన్స్ జియో సంస్థ టవర్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో 5జీ సేవలను అందించే విధంగా వీటిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. కొత్తగా ప్రారంభించిన సెల్ టవర్ల సహాయంతో మారు మూల ప్రాంతాల నుంచి నేరుగా ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల ప్రభుత్వ స్థలాలు ఇచ్చారు. డిసెంబర్ నాటికి టవర్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.