'ఆడుదాం ఆంధ్రా' పోటీలను ప్రారంభించిన సీఎం జగన్

సీఎం జగన్‌ 'ఆడుదాం ఆంధ్రా' పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

By Srikanth Gundamalla
Published on : 26 Dec 2023 1:55 PM IST

cm jagan,  adudam andhra programme, ycp,

'ఆడుదాం ఆంధ్రా' పోటీలను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్‌ 'ఆడుదాం ఆంధ్రా' పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకరులకు కిట్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయిగా ఉంటాయని అన్నారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగ అనీ.. 47 రోజుల పాటు ఈ పోటీలు సందడిగా కొనసాగుతాయని చెప్పారు. ఈ క్రమంలో క్రీడాకారులంతా ఉత్సాహంగా పాల్గొనాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 10 తేదీ వరకు ఊరూరా పండుగ వాతావరణంలో ఈ పోటీలు జరుగుతాయని సీఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమైన రెండు ఉద్దేశాలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్‌ చేయాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రతి ఊరిలో జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ వ్యాయమం అని చెప్పారు సీఎం జగన్. స్పోర్ట్స్‌ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే అవేర్‌నెస్‌ ప్రోగ్రాంగా కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. విలేజ్‌ క్లినిక్స్, ఫామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామస్థాయిలోనే ప్రివెంటివ్‌ కేర్‌పై దేశం మొత్తం గర్వపడేలా ఎప్పుడూ పడని అడుగుల మన రాష్ట్రంలో పడుతున్నాయని సీఎం జగన్ అన్నారు.

క్రీడాలతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని సీఎం జగన్ వివరించారు. అలాగే అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచేయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామన్నారు సీఎం జగన్.

'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. సరాదాగా క్రికెట్‌ ఆడారు. కాసేపు బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. బ్యాట్స్‌మెన్‌ స్టైల్‌లో క్రికెట్ ఆడిన సీఎం జగన్. బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి బౌలింగ్ చేస్తుంటే.. మంత్రి రోజా కీపింగ్ చేశారు. కొన్ని బంతులను ఆడిన సీఎం జగన్ ఆ తర్వాత క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లను పంపిణీ చేశారు.

Next Story