సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఎం.రవిచంద్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు.

By M.S.R  Published on  12 Jun 2024 5:22 PM IST
CM Chandrababu Naidu,  Chief Secretary, M Ravichandra,

సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఎం.రవిచంద్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర. 2003లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన రవిచంద్ర వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అతను తూర్పు గోదావరి, నెల్లూరు కలెక్టర్‌గా కూడా పనిచేశారు.

సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన కొద్ది నిమిషాల్లోనే ఏపీ చీఫ్‌ సెక్రటరి నీరబ్‌ కుమార్‌ ముద్దాడ రవిచంద్రను సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Next Story