Vijayawada: సాయిబాబా మందిరానికి యాచకుడు రూ.లక్ష విరాళం
ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 1:52 AM GMTVijayawada: సాయిబాబా మందిరానికి యాచకుడు రూ.లక్ష విరాళం
గుళ్లు.. ట్రాఫిక్ సిగ్నల్స్.. బస్టాపుల వద్దచాలా మంది యాచకులు కనిపిస్తుంటారు. కడుపు నింపుకోవాలని డబ్బులు ఇవ్వాలంటూ వేడుకుంటూ ఉంటారు. అయితే.. వీళ్లను ఒక్క పక్కనపెడితే మనం ఈ మధ్యకాలంలో కొందరు యాచకులను చూస్తుంటాం. వారి దగ్గర లక్షల రూపాయల కొద్ది డబ్బులు ఉంటున్నాయనీ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. విజయవాడలో ఓ యాచకుడి సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం అతను భారీ విరాళం అందించాడు.
ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడే స్థానికంగా ఉంటూ భిక్షమెత్తుకుంటోన్న యాదిరెడ్డి అనే యాచకుడు ఆలయ నిర్వాహకులను కలిశాడు. తాను కూడా అభివృద్ది పనులకు సాయం చేస్తానని చెప్పాడు. అతను ఏకంగా వారికి రూ.లక్ష విరాళం అందించాడు. తద్వరా వార్తల్లో నిలిచాడు. ఈ డబ్బులను శుక్రవారమే మందిరం గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డికి అందించాడు. తాను మందిరం వద్ద భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని స్వామికే ఇచ్చానని చెప్పాడు యాదిరెడ్డి. ఇక తన జీవితం బాబాకే అంకితమని.. భవిష్యత్తులో తాను సంపాదించిన ప్రతి రూపాయి దైవ కార్యాలకే వినియోగిస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు యాదిరెడ్డి బాబా మందిరానికి రూ.8.54 లక్షల విరాళం ఇచ్చారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. భారీ విరాళం ఇచ్చిన యాదిరెడ్డిని మందిర నిర్వాహకులు సన్మానించారు.
యాదిరెడ్డి 2022లో రూ.2లక్షల విరాళం ఇచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. అతను నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన వ్యక్తి అనీ.. ఉపాధి కోసం విజయవాడ వచ్చారని చెబుతున్నారు. 30 ఏళ్ల పాటు రిక్షాను లాగి ఉపాధి పొందాడనీ.. ప్రస్తుతం భిక్షాటన చేస్తూ డబ్బులు సేకరించి సాయిబాబా ఆలయానికి విరాళం ఇస్తున్నారని చెబుతున్నారు.