పవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టిన బండ్ల గణేష్
పవన్‌పై సీఎం జగన్ వ్యాఖ్యలను సినీ నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 2:00 PM ISTపవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టిన బండ్ల గణేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మూడు నాలుగేళ్లకు ఒకసారి పవన్‌కు ఇల్లాలు మారుతుందంటూ విమర్శల చేశారు. అయితే.. తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలను సినీ నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. ఉన్నత స్థాయిలో ఉంటూ.. ఓ పార్టీ అధినేతగా ఒకరి వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన బండ్ల గణేష్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత నుంచి ఎంతో వేదనను అనుభవిస్తున్నట్లు చెప్పారు బండ్ల గణేష్. ఇప్పటికైనా మాట్లాడకపోతే తన బతుకుపై తనకే చిరాకు కలుగుతుందని అన్నారు. తనకు దైవ సమానుడైన పవన్ కళ్యాణ్ గురించి సీఎం జగన్ అభ్యంతరకరంగా మాట్లాడారని అన్నారు. జగన్ ఒక పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు ఆయనకు అద్భుతమైన పొజిషిన్ ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన చెబుతునంటూ.. పవన్ నిజాయితీపరుడు, ఎవరు కష్టాల్లో ఉన్నా అవన్నీ తనవని భావించే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. అందరి జీవితాల్లో చేదు ఘటనలు జరుగుతాయి.. అలాగే పవన్ ప్రమేయం లేకుండా ఆయన లైఫ్‌లో కొన్ని జరిగాయన్నారు.
పవన్‌కు సంబంధం లేని విషయం గురించి పదేపదే మాట్లాడటం చాలా బాధగా ఉందని బండ్ల అన్నారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి అని.. స్వార్థం కోసం ఎప్పుడూ మాట్లాడరు అని అన్నారు. సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ హాయిగా ఉండాలని చెప్పానని.. కానీ ఆయన ప్రజలకు ఏదైనా చేయాలని ఎప్పుడూ అనేవారని గుర్తుచేసుకున్నారు. ప్రజల కోసమే రాత్రింబవళ్లు కష్టపడుతున్న వ్యక్తి పవన్ అన్నారు. షూటింగ్‌లు చేసి సంపాదించిన డబ్బును జనసేన పార్టీ కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా రూపాయి తీసుకోకుండా పార్టీ నడుపుతున్న మహానుభావుడు అంటూ పవన్‌ను కొనియాడరు బండ్ల గణేష్. అలాంటి వ్యక్తిపై అభాండాలు వేయొద్దని బండ్ల గణేష్ చేతులెత్తి మొక్కారు. తాను జనసేన పార్టీ కార్యకర్తను కాదనీ.. పవన్ అభిమానిగా.. ఆయన నిర్మాతగా కోరుకుంటున్నా అని బండ్ల గణేష్ భావోద్వేగం అయ్యారు.
Bandla Ganesh reacts to AP CM Jagan's comments against the personal life of Pawankalyan. pic.twitter.com/YXIGfgqn1h
— Satya (@YoursSatya) October 13, 2023