ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ - 1 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 12:18 PM GMTఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ - 1 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 17న సాయంత్రం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ఎంపికైన వారి వివరాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా... 110 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను APPSC వెల్లడించింది. మొత్తం 111 గ్రూప్-1 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశారు అధికారులు. ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లో తొలి మూడు ర్యాంకులు మహిళలే సాధించారు. మొదటి ర్యాంక్ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష సాధించగా.. రెండో ర్యాంకర్ గా అనంతపురం జిల్లాకు చెందిన భూమిరెడ్డి భవాని నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో లక్ష్మీ ప్రసన్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి వరుస స్థానాల్లో నిలిచినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఏపీలో ఖాళీగా ఉన్న 111 గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం గతేడాది సెప్టెంబర్ 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు మొత్తం 1.26 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది జనవరి 8న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో 82.38 శాతం హాజరయ్యారు. రికార్డు స్థాయిలో అధికారులు 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెల్లడించారు. 1:50 పద్దతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ..6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా కమిషన్.. కేవలం 34 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించింది. ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఆగస్టు 17న తుది ఫలితాలు ప్రకటించారు.