పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం మహిలలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు.
By Srikanth Gundamalla
పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం మహిలలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పిఠాపురంలోని పాదగయలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు పవన్ కల్యాణ్ మహిళలకు గిఫ్ట్‌లు అందించనున్నారు. వత్రాలకు పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులతో 12వేలమందికి చీరలు, వ్రత పూజ సామగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చచేయాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ను సూచించారు డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్. కాగా.. ప్రతీ ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురూహూతికా ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. అలాగే ఆగస్టు 30వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఇక్కడికి వచ్చే మహిళల కోసం డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్‌లను అందిస్తున్నారు.
కాగా.. పవన్ కల్యాణ్ అందించనున్న 12వేల చీరల్లో 6వేల చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం దగ్గర పూజ ముగిసిన తర్వాత ఇవ్వనున్నారు. మిగిలిన 6వేల చీరలను స్థానిక ఎమ్ఎల్యే చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆడపడుచులకు పవన్ కల్యాణ్ అందించనున్నారు. మరోవైపు వరలక్ష్మీ వ్రతాల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో భవనా చెప్పారు. విశాలమైన స్థలంలో వ్రతాలు చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు.