ముగిసిన ఏపీ కేబినెట్‌.. ఆమోదించిన అంశాలు ఇవే..

ap cabinet meeting details ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది.

By సుభాష్  Published on  27 Nov 2020 7:46 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్‌.. ఆమోదించిన అంశాలు ఇవే..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబినేట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియా స‌మావేశంలో వివరించారు. క‌రోనా కార‌ణంగా ఉద్యోగుల‌కు కోత పెట్టిన వేత‌నాల‌ను డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి నెల‌ల్లో చెల్లింపులు చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ మేర‌కు కేబినేట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావం పై చ‌ర్చించామ‌ని బాధిత రైతుల‌ను ఆదుకోవాల‌ని సీఎం ఆదేశించిన‌ట్లు చెప్పారు.

డిసెంబ‌ర్ 25న పేద‌లందరికీ ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభిస్తామ‌న్నారు. తొలి ద‌శ‌లో 16ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ల స్థ‌లాల‌ను తర్వాతి ద‌శ‌లో ప్రారంభించేందుకు కేబినేట్ నిర్ణ‌యించింద‌న్నారు. ఆయా ఇళ్ల‌కు ఉచితంగా ఇసుకు ఇవ్వాల‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ద‌శ‌ల్లో 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామ‌న్నారు.

క్యాబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే

*డిసెంబర్‌ 15న రైతులకు రూ.1227 కోట్లతో పంట బీమా పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

*ఈ క్రాప్‌ బుకింగ్‌లో రైతులు బీమా చేసుకున్న పంటలకు ఉచితంగానే ఇన్సూరెన్స్‌ ప్రయోజనం.

*డిసెంబర్ 2 తేదీన ఏపీ-ఆముల్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు.

*వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ సేవలు ప్రారంభం.

*డిసెంబర్‌ 2న అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

*తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో బల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల అభివృద్ధికి నిర్ణయం

*రాష్ట్ర వ్యాప్తంగా 9889 రైతు భరోసా కేంద్రాల్లో ఇవి ప్రారంభం చేసేందుకు నిర్ణయం

*డిసెంబర్‌ 10న వైఎస్ ఆర్ చేయూత పధకం కింద గొర్రెలు, మేకల యూనిట్లు లబ్ధిదారులకు అందించనున్న సీఎం జగన్‌

*నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం

*ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం

*వైఎస్సార్‌ శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం (సమగ్ర సర్వే)కు కేబినెట్‌ ఆమోదం

*రూ.927 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం

*ఏపీ గేమింగ్‌, యాక్ట్‌ను సవరిస్తూ ఆన్‌లైన్ గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టేలా ఆర్డినెన్స్‌కు ఆమోదం

*వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గేమింగ్‌ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం

*పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను సవరణ బిల్లు తీసుకురావాలని నిర్ణయం

*వార్షిక అద్దె విలువ ప్రకారం నిర్ధారించే ఆస్తిపన్ను స్ధానంలో కొత్త విధానానికి కేబినెట్ నిర్ణయం

*స్ధానిక సంస్ధల పన్నులను సీఎంఎఫ్‌ఎస్‌ నుంచి డీ లింక్‌ చేస్తూ కేబినెట్ నిర్ణయం

*ఏపీ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరుతో ఎస్‌పీపీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం

*కొల్లేరు సెలినిటీ మిటిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం

*కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక హబ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల రాయితీలకు కేబినెట్‌ ఆమోదం

*టిడ్కో ఇళ్లను రూపాయికే ఇచ్చేందుకు, లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేసేందుకు నిర్ణయం

Next Story