Andhra Pradesh: టీడీపీ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్త
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: టీడీపీ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్త
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కొంత మంది సామాన్యులు అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. వీరిలో అల్లూరి సీతారామరాజు రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి అంగన్‌వాడీ కార్యకర్త మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమ్మంగి మండలం అనంగిరిక చెందిన శిరీష 9,189 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై గెలిచారు. రంపచోడవరంలో 2014, 2019 ఎన్నికలలో గెలిచిన వైసీపీ ఈసారి ఓడించారు. శిరీషాదేవికి 90,087 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్తి ధనలక్ష్మికి 80,948 ఓట్లు పోల్ అయ్యాయి.
తన విజయానికి పార్టీ పరిశీకులు చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబూరమేశ్, వంతల రాజేశ్వరి చేసిన కృషి మరువలేన్నారు శిరీషా దేవి. అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసిన తనని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అలాగే తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రంపచోడవరంలో 15 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడం సంతోషాన్ని ఇచ్చింద్నారు శిరీషా దేవి. కూటమి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో సుపరిపాలన అందుతుందని చెప్పారు.
కాగా.. శిరీషాదేవి రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో జన్మించారు. ఆమె బీఈడీ చదవారు. ఎనిమిదేళ్లు అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేశారు. ఆమె తల్లి కష్ణవేణి అనంతగిరి గ్రామ వార్డు మెంబర్ కాగా.. శిరీషాదేవి భర్త మటం భాస్కర్ టీడీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది శిరీషా. 2024లో టీడీపీ టికెట్ దక్కించుకుని.. ఏకంగా అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు.