వాటిని డిలీట్ చేయండి..వాలంటీర్లకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 9:06 AM ISTవాటిని డిలీట్ చేయండి..వాలంటీర్లకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కీలక అంశాలను ప్రస్తావించింది. గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను, టెలిగ్రామ్ గ్రూప్‌లను క్రియేట్ చేశారని వాటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో.. ఈ అంశాని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆయా గ్రూపులను వెంటనే డెలిట్ చేయాలని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన నివేదికలను ఆగస్టు 5వ తేదీ సాయంత్రానికి ఇవ్వాలని సూచించింది. ఈ గ్రూపుల్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించారు. ఈ తరహా గ్రూప్స్ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రజలకు సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
ఇక ఇటీవల సీఎం చంద్రబాబు ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై సమీక్ష చేశారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధంగా వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే.. వారి సేవల్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం.