తొలి 30 రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన పనులివే..
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 July 2024 5:30 AM GMTతొలి 30 రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన పనులివే..
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. అఖండ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి పనుల్లో వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఇవాళ్టితో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 30 రోజులు అవుతోంది. ఈ నెల రోజుల్లో చాలా కీలక నిర్ణయాలు, పనులను చేపట్టింది ప్రభుత్వం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్‌డీయే కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్రంలోని 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీ 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఆ తర్వాత జూన్ 12న ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేసే దిశగా తొలి అడుగులోనే చర్యలు చేపట్టారు.
సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ పెంపు, స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి అడుగులోనే ఐదు హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆ తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గడిచిన నెల రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు.. సమీక్షలతో ఏపీ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు.
నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు..
* 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
* వృద్ధాప్య, వితంతు పింఛను రూ.4000కి పెంపు
* దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000కి పెంపు
* ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పింఛను పంపిణీ
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
* ఉచిత ఇసుక అమలు
* ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
* గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు, ఎర్ర చందనంపై ఉక్కుపాదం
* రాజధాని అమరావతి పనులు ప్రారంభం
* ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం మార్గదర్శకాలు
* జగన్ బొమ్మతో ఉన్న పాసుపుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసుపుస్తకాలు
* పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల
* భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు 2026కి పూర్తిచేయాలని ఆదేశం
* ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు
* ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు
* తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు
* నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు
* కేంద్రంతో పలు అంశాలపై చర్చలు సఫలం