వైసీపీలో చేరిన క్రికెటర్‌ అంబటి రాయుడు

క్రికెటర్‌ అంబటి రాయుడు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.

By Srikanth Gundamalla  Published on  28 Dec 2023 7:30 PM IST
ambati rayudu,  ycp, cm jagan ,

వైసీపీలో చేరిన క్రికెటర్‌ అంబటి రాయుడు 

క్రికెటర్‌ అంబటి రాయుడు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కండువాను కప్పి అంబటి రాయుడిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్. ఈ కార్యక్రమం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. అంబటి తిరుపతి రాయుడు పార్టీలో చేరిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన అంబటి రాయుడు.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించినానని చెప్పారు. సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌టీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే.. ఏపీలో వైసీపీ పాలన బాగుందని చెప్పారు. మొదట్నుంచి జగన్‌పై మంచి అభిప్రాయం ఉందని పేర్కొన్నారు అంబటి రాయుడు. ఆయన కుతలమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని అంబటి రాయుడు ప్రశంసించారు. అందుకే సీఎం జగన్‌ పాలనకు మద్దతుగా గతంలో కొన్ని ట్వీట్లు కూడా చేసినట్లు అంబటి రాయుడు వెల్లడించారు.

రాజకీయాల ద్వారా ప్రజలకు అండగా ఉంటానని అంబటి రాయుడు అన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ గతంలో చాలా ఆరోపణలు చేశారనీ.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెబుతున్నారని అన్నారు. వైసీపీ పథకాలను విమర్శించిన వారే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ సందర్భంగా అంబటి రాయుడు పేర్కొన్నారు.


Next Story