నటి జత్వానిపై వేధింపుల వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఏపీ సర్కార్‌ చర్యలు

జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2024 7:30 PM IST
నటి  జత్వానిపై వేధింపుల వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఏపీ సర్కార్‌ చర్యలు

ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ నివేదిక అందించిన తర్వాత.. ముగ్గురు ఐపీఎఎస్‌ అధికారులపై చర్యలు తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్​ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

ముంబై నటి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు.. ఆమెను వేధింపులకు గురిచేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా , విశాల్‌ గున్నీలపై చర్యలు తీసుకున్నారు.

Next Story