కేరళ ఏనుగు ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం.. ఆవు నోట్లో బాంబు పేలి..
By సుభాష్ Published on 29 Jun 2020 10:58 AM ISTఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కొగిలేరులో వేటగాళ్ల నాటుబాంబు వల్ల ఓ ఆవు నోరు ఛిద్రమైంది. వేటగాళ్లు పండులో నాటుబాంబు పెట్టారు. ఇక మేత కోసం వెళ్లిన ఆ ఆవు.. ఆ పండును కొరకడంతో అది పేలడంతో ఆవు నోరు పూర్తిగా గాయాలైన తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల కేరళలోని పాలక్కడ్ జిల్లా మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు నోట్లు కొబ్బరికాయలో బాంబు పేట్టి చంపిన విషయం తెలిసిందే. ఆ కేరళ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ ఆవుకు నోట్లో పండుతో బాణసంచాలు పెట్టి పేల్చడంతో ఆవుకు తీవ్రగాయాలయ్యాయి. ఇక తాజాగా ఏపీలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా మూగ జీవాలపై దారుణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మానవమృగాళ్లు మనుషులపైనే కాకుండా జంతువులపై కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడటంతో సంచలనంగా మారుతున్నాయి.