ఒకరి కౌగిలిలో ఒకరు.. ఈ బుగ్గ కొరుకుడులో ఇది గ‌మ‌నించారా?

By అంజి  Published on  6 Feb 2020 4:37 AM GMT
ఒకరి కౌగిలిలో ఒకరు.. ఈ బుగ్గ కొరుకుడులో ఇది గ‌మ‌నించారా?

బుగ్గ కొరుకుడుకు తెలుగు బుల్లితెర కేరాఫ్ అడ్ర‌స్‌గా మార‌నుందా..? అన్న ప్ర‌శ్న‌కు అవున‌న్న స‌మాధానం వినిపించ‌క మాన‌దు. యాంక‌ర్ వ‌ర్షిణితో మొద‌లైన ఈ ట్రెండ్‌కు కొన‌సాగింపుగా న‌టి పూర్ణ మ‌రో ఘాటైన ముద్దుతో వార్త‌ల్లో నిలిచింది. తాజాగా విడుద‌లైన ఢీ ఛాంపియ‌న్స్‌ ప్రోమోనే ఇందుకు నిద‌ర్శ‌నం.

బుగ్గ కొరికేసిన పూర్ణ‌

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రీ సాంగ్‌కు కంటెస్టెంట్ జ‌తిన్ వేసిన స్టెప్పుల‌కు ఇంప్రెస్ అయిన పూర్ణ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి త‌న ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌నో.. ఏమో కానీ..కంగ్రాట్స్ చెప్పేందుక‌ని ద‌గ్గ‌రకు పిలిచి ఉన్న‌ట్టుండి జ‌తిన్ బుగ్గ కొరికేసింది పూర్ణ‌. ఇంకాసేపు అలానే ఉంటే ర‌క్తం వ‌చ్చేదేమో అన్న మాదిరి జ‌తిన్ బుగ్గ‌పై పూర్ణ త‌న పంటిగాటును పెట్టింది.దీంతో ఈ వీడియో కాస్తా ట్రెండింగ్‌లో నిలిచింది.

Image (3)

నాగార్జున సాంగ్‌తో మెప్పించాడు

టాలీవుడ్‌లో స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన మాస్ మూవీలోని టైటిల్ సాంగ్‌కు జ‌తిన్ ఇచ్చిన వెరైటీ ప‌ర్ఫామెన్స్‌ జ‌డ్జెస్‌ను ఆక‌ట్టుకుంది. ముఠామేస్త్రీ సాంగ్ మ్యాజిక్‌ను మాస్ టైటిల్ సాంగ్‌లోనూ రిపీట్ చేస్తూ జ‌తిన్ ఇచ్చిన ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్స్ అద్దిరిపోయాయ‌నే చెప్పాలి. జ‌తిన్ మాస్ ఎలిమెంట్స్‌కు తాను ఫిదా అంటూ పూర్ణ ఇప్ప‌టికే చాలా సార్లు చెప్ప‌క‌నే చెప్పింది. ఆ ల‌వ్ కాస్తా ముదిరి బుగ్గ కొరుకుడు దాకా వ‌చ్చిందేమో. వ‌చ్చిన అవ‌కాశాన్ని అస్స‌లు వ‌దులుకోలేక‌పోయింది.

వ‌ర్షిణి సీన్ రిపీట్‌

ప్ర‌స్తుతం వ‌ర్షిణి చేస్తున్న ప‌టాస్ షోలో త‌న‌కు జోడీగా జ‌బ‌ర్ద‌స్త్ చ‌లాకి చంటి వ‌చ్చి చేరాడు. అయినా రేటింగ్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌కుండా షో దూసుకుపోతోంది. కామెడీ పంచ్ లైన‌ప్‌ల‌తో చంటి విరుచుకుప‌డుతుండ‌గా, అస‌లే మోడ‌లింగ్ నుండి వ‌చ్చిన వ‌ర్షిణి స‌రికొత్త దుస్తుల‌తో ద‌ర్శ‌న‌మిస్తూ కుర్ర‌కారు క‌నురెప్ప‌కు ప‌రీక్ష పెడుతోంది. ఆ క్రమంలోనే షోలో పాటిస్పేట్ చేసిన ఓ కుర్రాడిని పిలిచి మ‌రీ వ‌ర్షిణి ఇచ్చిన ముద్దు ట్రెండింగ్‌లో నిలిచింది. బుగ్గ‌కు పంటి గాటు ప‌డేలా ఇచ్చిన ముద్దు ట్రెండింగ్‌లో ఉండ‌క త‌ప్ప‌దుగా.

Image (4)

ఆపుకోలేక‌పోతే ఎలా?

యాంగ్జైటీ ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఉంటుంది. అతి ఎంత ప‌రిమిత స్థాయిలో ఉంటే అంత మంచిది. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా కాదు కూడ‌ద‌ని దాన్ని బ‌య‌ట‌కు తీశావో న‌వ్వుల‌పాల‌వ్వ‌క త‌ప్ప‌దు అంటూ వర్షిణి, పూర్ణ తీరుపై నెటిజ‌న్లు ఫైర‌వుతున్నారు. బిజీ లైఫ్‌లో కాస్త వినోదం కోసం చూసే షోలో కూడా అడ‌ల్ట్ కంటెట్ ప్ర‌ద‌ర్శిస్తే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిన ఈ షోల‌లో వ‌ర్షిణి, పూర్ణ తీరు మ‌రీ వ‌ర‌స్ట్ అన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.

కాస్త హీట్ పెంచిన ర‌ష్మీ - సుధీర్‌

ప్రోమో మ‌ధ్య‌లో ర‌ష్మీ, సుధీర్‌ల‌ను ఉద్దేశిస్తూ శైల‌జా.. శైల‌జా రీమేక్ సాంగ్‌కు కంటెస్టెంట్స్ వేసిన స్టెప్పులు జ‌డ్జీల‌ను ఓ రేంజ్‌లో ఉర్రూత‌లూగించాయి. షాక్‌లో ఉన్న ర‌ష్మీ - పాట పాడుతున్న సుధీర్ అంటూ అన‌సూయ వాయిస్‌తో ఈ సాంగ్ మొద‌లైంది. ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌తో ఫ‌న్నీగా సాగిన ఈ సాంగ్‌ను ర‌ష్మీ, సుధీర్ సైతం ఎంతో ఆనందించారు. సాంగ్‌లో త‌న క్యారెక్ట‌రైజేష‌న్‌ను చూసుకున్న ర‌ష్మీ న‌వ్వుతూ సుధీర్ ఒడిలో ప‌డిపోయింది. ఏదేమైనా ఈ నెల 12న టెలికాస్ట్ కానున్న ఈ షో ఆడియ‌న్స్‌కు ఓ మాంచి కిక్కివ్వ‌నుంద‌ని తెలుస్తుంది.

Next Story