వ‌ర్షిణి.. వ‌ర్క‌వుట్ అవుతుందంటావా..?

By సుభాష్  Published on  28 Dec 2019 3:47 AM GMT
వ‌ర్షిణి.. వ‌ర్క‌వుట్ అవుతుందంటావా..?

ట్రెండింగ్ టాపిక్‌ను ఫాలో అవ్వ‌డం అంద‌రి నైజం. ముఖ్యంగా రాజ‌కీయ‌, సినీ రంగాల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఆ త‌ర‌హా ట్రెండింగ్ టాపిక్‌నే ఇప్పుడు యాంక‌ర్ వ‌ర్షిణి ఫాలో అయ్యేందుకు రెడీ అయింది. అందుకు త‌న పాట్న‌ర్‌ను కూడా ప‌ట్టేసింది. ఇంత‌కీ వ‌ర్షిణి సెలెక్ట్ చేసుకున్న ఆ ట్రెండింగ్ టాపిక్ ఏంటి..? ఆ పాట్న‌ర్ ఎవ‌రు..? అన్న వివ‌రాల‌లోకెళ్తే..

ప్ర‌స్తుత రోజుల్లో బుల్లితెరపై బెస్ట్ కెమిస్ట్రీని పండించే జంట ఏదైనా ఉందా..? అంటే అది ఒక్క సుడిగాలి సుధీర్ - యాంక‌ర్ ర‌ష్మీ జంటనే. జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రారంభం నుంచి వీరి మ‌ధ్య కెమెస్ట్రీ ఓ రేంజ్‌లో న‌డుస్తుందంటూ సోష‌ల్ మీడియాలో సైతం ప‌లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. వీరి మ‌ధ్య కొన‌సాగుతున్న కెమిస్ట్రీ నిజమేనా..? అన్న ప్ర‌శ్న‌కు ఇదివ‌ర‌కే క‌మెడియ‌న్ గెట‌ప్ శ్రీ‌ను క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

కేవ‌లం అభిమానులకు వినోదం పంచేందుకు మాత్ర‌మే సుధీర్ - ర‌ష్మీ అలా ప్ర‌వ‌ర్తిస్తుంటార‌ని, అది కేవ‌లం బుల్లితెర వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని గెట‌ప్ శ్రీ‌ను చెప్పిన సంగతి తెలిసిందే. షో అనంత‌రం ఎవ‌రి బిజీ లైఫ్‌ను వారు లీడ్ చేస్తుంటారు. అంతేకానీ, టీవీలో క‌నిపించిన మాదిరి వారు బ‌య‌ట ఉండ‌ర‌ని, మాట వ‌ర‌స‌కు కూడా వారు క‌లిసింది లేదంటూ సుధీర్ - ర‌ష్మీ కెమిస్ట్రీపై అడిగిన ప్ర‌శ్న‌కు గెట‌ప్ శ్రీ‌ను స‌మాధానం చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా, వారిద్ద‌రి మ‌ధ్య ఏం లేదంటూ ఎవ‌రు ఎంత వాదించినా పుకార్ల‌కు మాత్రం ఫుల్‌స్టాప్ ప‌డ‌టం లేదు. వీరు చేసే షోల‌ ప్రోమోలు సైతం పుకార్ల‌కు మ‌రింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇలా కెమిస్ట్రీకే కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న ఈ జంట వీడియోలు కోట్లలో వ్యూస్‌ను రాబ‌ట్ట‌డంతోపాటు వాట్సాప్ స్టేట‌స్‌ల‌లో సైతం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఇదే త‌ర‌హా కెమిస్ట్రీని పండించేందుకు యాంక‌ర్ వ‌ర్షిణి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అందుకు త‌న పాట్న‌ర్‌గా హైప‌ర్ ఆదిని సెలెక్ట్ చేసుకుంది. తాజాగా విడుద‌లైన ఢీ ఛాంపియ‌న్స్ ప్రోమోనే ఇందుకు నిద‌ర్శ‌నం. ప్రోమోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ‌జవ‌ర‌గ‌మ‌న సాంగ్‌కు వ‌ర్షిణి హైప‌ర్ ఆదితో క‌లిసి స్టెప్పులేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది యాంక‌ర్ల‌తో క‌లిసి షోను లీడ్ చేసిన‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రితోనూ వ‌ర్షిణి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ కాలేదు. తాజా ఢీ ఛాంపియ‌న్స్ ప్రోమోలో ఆది, వ‌ర్షిణి హావ భావాలు వీర లెవ‌ల్లో ఉన్నాయ‌ని, ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు మాత్రం హైప‌ర్ ఆదితో నీ డ్యాన్స్ సూప‌రెహా..! అంటూ వ‌ర్షిణిపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సుధీర్ - ర‌ష్మీల మాదిరే వీరి మ‌ధ్య బుల్లితెర కెమిస్ట్రీ పండాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

Next Story
Share it