ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు.. యాంకర్‌ అనసూయ సీరియస్‌

By సుభాష్  Published on  17 April 2020 2:50 PM GMT
ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు.. యాంకర్‌ అనసూయ సీరియస్‌

యాంకర్‌ అనసూయ.. ఈమె గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. బుల్లితెరపై యాంకరింగ్‌ వెండితెరపై యాక్టింగే కాదు.. సామాజిక బాధ్యత కూడా ఉందని నిరూపించుకుంటుంది.. ఎప్పుడు షూటింగ్‌లు, యాంకరింగ్‌లలో బిజీగా ఉండే అనసూయ.. అప్పుడప్పుడు సామాజిక విషయాలపై కూడా స్పందింస్తుంటారు. కాగా, అనసూయకు ఓ వీడియో చూసి తెగ కోపం వచ్చింది. వెంటనే ఆ వీడియో లింక్‌ను తన సోషల్‌ మీడియా పేజీలో పోస్టు చేసి ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రస్తుతం టిక్ టాక్‌ రాజ్యం కొనసాగుతోంది. ఈ టిక్ టాక్‌ వీడియోను ప్రతీ ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఏది పడితే అది వీడియో చేయడం టిక్ టాక్‌లో పెట్టేయడం ఇదే పని వాళ్లది.

టిక్ టాక్‌ వీడియోలు చేస్తూ పాపులర్‌ కావాలని చూస్తున్నారు. కొందరు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం వీడియోలు చేస్తుంటే కొందరు పనికిరాని చెత్త వీడియోలు చేస్తున్నారు. మంచి, చెడు అనేది లేకుండా ఏది పడితే అది చేస్తూ టిక్ టాక్‌ను వాడేసుకుంటున్నారు.

ఇప్పుడు యాంకర్‌ అనసూయకు అలాంటి వీడియో ఒకటి ఎదురైంది. అసలే కరోనా వైరస్‌తో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఈ వీడియోను చూసి మండిప‌డిపోయింది. కరోనా వైరస్‌ ఎలా వ్యాప్తి చేయాలో చేసిన ఈ వీడియోను చూసి అనసూయ సీరియస్‌ అయ్యింది. వీడియో లింక్‌ను పోస్టు చేసి ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పు లేదు. ఎవరిని నిందించాలో కూడా అర్దం కావడం లేదు అంటూ పోస్ట్‌ చేసింది అనసూయ. ఈ వీడియోను ఎవరు చూసినా కూడా కోపం వచ్చేస్తుంది.

ఈ వీడియో సారాంశం ఏంటంటే... ఓ యువకుడు తన మిత్రుడితో కలిసి అటు ఇటు ఆడుతూ వెళ్తుంటాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసుకోకుండా ఆమెకు డ్యాష్‌ ఇస్తాడు. దీంతో వెంటనే అమ్మాయికి కోపం వచ్చి చెంపపై లాగి కొడుతుంది. అమ్మాయి కొట్టినందుకు ప్రతీకారంగా ఆ యువకుడు తన మిత్రుడు.. ఇద్దరూ తన అరచేతిపై ఉమ్మివేసి ఆ అమ్మాయి వద్దకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు. దీంతో ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత యువకుడు హీరోలా తెగ ఫోజులిస్తూ వెళ్తుంటాడు. మళ్లీ ఈ చెత్త వీడియోకు ఓ బ్యాక్‌ రౌండ్ మ్యూజిక్‌.

వెంటనే ఇతని అకౌంట్‌ను తొలగించాలని నేను టిక్ టాక్‌ ఇండియాను కోరుతున్నా.. అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఈ వీడియో బట్టి ఏం అర్థం అవుతుందంటే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేలా చేస్తున్నట్లు. అందుకే అనసూయకు తెగ కోపం వచ్చి తిట్టిపారేస్తుంది. ఇలాంటి వాళ్లను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటోంది.Next Story
Share it