ఫంక్షన్‌కు పిలవలేదని 'రంగమ్మత్త'కు కోపమొచ్చింది
By సుభాష్ Published on 17 Feb 2020 1:39 PM ISTయాంకర్ అనసూయ.. తెలుగు బుల్లి తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో ఎంతో పాపులారిటీ పొందింది. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతుల సంపాదించుకుంటోంది. కాగా, 'క్షణం' సినిమాల్లో మెరిసిన అనసూయ.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన రంగస్థలం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో రంగమ్మత్తగా తెగ అగరగొట్టి ప్రేక్షకులను ఎంతో ఆకర్షించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్ పై రంగమత్త అలిగింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ (65) అవార్డుల ప్రదానోత్సవం ఈ సారి అసోంలోని గుహవాటికలో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిలింఫేర్ అవార్డుల్లో 'గల్లీబోయ్' ఉత్తమ చిత్రంగా నిలువగా, ఉత్తమ నటుడిగా రణ్‌వీర్ సింగ్ దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డును కైవసం చేసుకోగా, ఉత్తమ దర్శకురాలుగా జోయా అక్తర్ దక్కించుకుంది. దీనికి తోడు గల్లీబోయ్ మ్యూజిక్ ఆల్బం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఇలా పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. అలాగే ఈ మూవీలో నటించిన సిద్ధాంత్ చతుర్వేది, అమృతా సుభాష్ వరుసగా ఉత్తమ సహాయనటులు, ఉత్తమ సహాయనటి అవార్డులను దక్కించుకున్నారు.
కాగా, ఈ అవార్డ్స్ ను ఏకపక్షంగా ఇచ్చారని కంగనా రనౌత్ సోదరి రంగోలీ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. ఆలియాభట్, అనన్య పాండే కంటే బాగా నటించే చాలా మంది నటీమణులు సినీ పరిశ్రమలో ఉన్నారని రంగోలో చెప్పుకొచ్చింది. 'గల్లీబోయ్' సినిమాలో అలియా భట్ నటన మామూలుగా ఉంటుందని, మరి అలాంటి నటికి అవార్డు ఎలా ఇచ్చారంటూ ట్వట్టర్‌లో ప్రశ్నించింది.
ఇక ఇదే విషయంపై కూడా రంగమ్మత్త 'అనసూయ' కూడా ధ్వజమెత్తింది. గల్లీబోయ్ పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డు ఇవ్వగా, ఇదేం చాయిస్ అని, అక్షయ్ కుమార్ నటించిన కేసరి సినిమాలో తేరెమిట్టికి ఇవ్వకుండా అలా ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. అంతేకాకుండా ఫిలింఫేర్ నిర్వాహకులకు విన్నర్లు మాత్రమే అవసరమని, నామినేట్ చేసిన వారిని ఎందుకు అవార్డ్ ఫంక్షన్‌కు ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది. దీంతో అనసూయ తెగ అలిగేసింది.
�