హిట్ కొడతాడా.. లేక మళ్ళీ బ్లాంక్ పేస్ పెడతాడా..?

By Newsmeter.Network  Published on  16 Jan 2020 3:21 PM GMT
హిట్ కొడతాడా.. లేక మళ్ళీ బ్లాంక్ పేస్ పెడతాడా..?

అతి తక్కువ టైంలోనే సెన్సేషనల్ స్టార్ 'విజయ్ దేవరకొండ' తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తో ఫుల్ క్రేజీను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ క్రేజీ హీరో తమ్ముడు 'ఆనంద్ దేవరకొండ' దొరసాని'తో హీరోగా మారిన కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయాడు. బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథతో వచ్చిన దొరసాని చిత్రంలో యాక్టింగ్ పరంగా పూర్తిగా తేలిపోయాడు. కానీ, ఆనంద్ మాత్రం ప్రస్తుతం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదరర్ అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా డు. అందులో పాత్ర తనకు బాగా నచ్చిందిట. హీరో పాత్రలో భిన్న కోణాలు ఉంటాయని తెలుస్తోంది. ఎన్ని కోణాలు ఉంటే ఏం లాభం.. మనోడికి ఎలాగూ యాక్టింగ్ రాదుగా.

అయినప్పటికీ మనోడు భిన్నమైన సినిమా చేయబోతున్నాడన్నమాట. అయితే మొదటి చిత్రంలో ఆనంద్ దేవరకొండకి తన పాత్రలో మంచి ఎమోషన్ని పండించే అవకాశం పుష్కలంగా ఉన్నా.. ఆనంద్ దేవరకొండ మాత్రం మాట్లాడితే పళ్ళు మొత్తం కనబడేలా ఇకిలించడం.. బలమైన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బ్లాంక్ పేస్ తో సింగిల్ రియాక్షన్ తో సరిపట్టేశాడు. డాన్స్ పరంగా కూడా వీక్ మొమెంట్స్ తో బలం లేదనిపిస్తాడు. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ సినీ అవకాశాలను ఆనంద్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుని హిట్ కొడతాడా.. లేక మళ్ళీ బ్లాంక్ పేస్ తో తెల్ల మొహం పెడతాడా

Next Story
Share it