గ‌త‌వారం త‌ప్పించుకున్నా.. ఈ వారం మాత్రం అమ్మ రాజశేఖర్ ప‌క్కా ఎలిమినేట్..!

By సుభాష్  Published on  8 Nov 2020 6:07 AM GMT
గ‌త‌వారం త‌ప్పించుకున్నా.. ఈ వారం మాత్రం అమ్మ రాజశేఖర్ ప‌క్కా ఎలిమినేట్..!

తెలుగులో ప్ర‌సారం అవుతున్న బిగ్‌బిస్ సీజ‌న్ 4 తొమ్మిదో వారం చివ‌రికి వ‌చ్చేసింది. ఇక ఈ వారం ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి బయటకు వచ్చేయనున్నారని లీక్ వీరులు చెబుతున్నారు. ఈ వారంలో అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అమ్మ రాజశేఖర్, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక అందరి కంటే తక్కువ ఓట్లు అమ్మ రాజశేఖర్‌కి రావ‌డంతో ఆయ‌న హౌస్‌ని వీడార‌ని వినికిడి.

వాస్తవానికి గతవారంలోనే మాస్టర్ హౌస్ ను వదిలి రావాల్సివుంది. అమ్మ రాజశేఖర్ ను బ్యాగ్ సర్దుకోవాలని చెప్పిన హోస్ట్ నాగార్జున, చివరి క్షణాల్లో సేవ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాలు నొప్పి కారణంగా అనూహ్యంగా నోయల్ ఎలిమినేట్ కావడం.. ఎవరినీ కూడా నామినేట్ చేయొద్దని కోరడంతో మాస్టర్ సేవ్ అయ్యారు. అలా తప్పించుకున్నారు మాస్టర్. కానీ ఈ వారం ఎలిమినేష‌న్ కాక త‌ప్ప‌లేదు.

సీజన్ ప్రారంభంలో అమ్మ రాజశేఖర్ చాల సరదాగా ప్రేక్షకులని అలరించాడు. కాని నాలుగైదు వారాల్లో అతని స్వభావం చాలా మారిపోయింది. అతనిని నామినేట్ చేసిన లేదా అతని లోపాలను ఎత్తిచూపే హౌస్‌మేట్‌లను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాడు. శృతిమించి వేషాలు వేయ‌డం ప్రారంభించడంతో ప్రేక్షకులకి అమ్మ రాజశేఖర్ మీద ఆసక్తి తగ్గిపోవడం మొదలైంది.

Next Story