బిగ్‌బీకి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన అభిమాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 12:57 PM GMT
బిగ్‌బీకి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన అభిమాని

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కొన్ని దశాబ్ధాలుగా వెండితెరపై అలరిస్తూ వస్తున్నారు. 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' లాంటి షోస్‌కి హోస్టుగా చేయడంతో పాటు పలు వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన ఇంటి నిండా నౌకర్లు ఉన్నారు. అలాంటి అమితాబ్‌ బచ్చిన్‌కే ఓ వ్యక్తి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్‌ అభిమానులతో పంచుకున్నాడు.

కరోనా నేపథ్యంలో 65ఏళ్లు పైబడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్యన ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఇవి వివక్షపూరితమైన ఉత్తర్వులు అని అభిప్రాయపడింది. ఈ నిబంధనను ఉద్దేశిస్తూ.. అమితాబ్‌ తన కెరీర్‌ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఇకపై ఉద్యోగం దొరుకుతుందో, లేదో అంటూ ఓ అనుమానాన్ని ఇటీవల ఆయన వ్యక్తం చేశారు. కాగా దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ ఆయనకు జాబ్ ఆఫర్ చేశారు. ఆ విషయాన్ని తన బ్లాగులో తెలిపిన అమితాబ్‌.. ఇప్పుడు నాకు ఉద్యోగం దొరికింది అని రాసుకొచ్చారు. అంతేకాదు తన ఉద్యోగానికి భీమా కూడా ఉందని చివరగా కామెంట్‌ చేశారు.

కాగా.. ఇటీవల అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కరోనా బారిన పడిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు.

Next Story