టిక్ టాక్ పై అమెరికా విచారణ!!

By సత్య ప్రియ  Published on  2 Nov 2019 9:10 AM GMT
టిక్ టాక్ పై అమెరికా విచారణ!!

సోషల్ మీడియా మాధ్యమాలలో సరికొత్త సంచలనం... టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా, చిన్నా పెద్దా అందరూ, ఈ యాప్ ని వాడుతున్నారు. ఇందులో జోకులు, పాటలు, డైలాగ్స్ కు లిప్ సింక్ చేయడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తూ 15 సెకన్ల వీడియోలను సృష్టిస్తుంటారు.

అయితే, చైనా కు చెందిన ఈ యాప్ పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం, టిక్ టాక్ పై విచారణ ప్రారంభించనున్నట్టు అమెరికా ప్రకటించింది.

జాతీయ భద్రతా ప్రమాణాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాజకీయ సంబంధ సమాచారం, వ్యక్తిగత విషయాలు ఇతర దేశాలకు చేరుతున్నాయనే సందేహంతో ఈ విచారణ చేపట్టామని అధికారులు చెప్తున్నారు.

అమెరికా లో కూడా టిక్ టాక్ క్రేజ్ విపరీతంగా ఉంది. అమెరికా చైనా ల మధ్య వాణిజ్య పరమైన యుద్ధం జరుగుతున్నా, టిక్ టాక్ వినియోగదారులు మాత్రం తగ్గడం లేదు. పైగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

అయితే, దీనిపై టిక్ టాక్ సంస్థ స్పందించింది. ఏ దేశానికీ భయపడి కానీ, వేరువిధంగా కానీ తమ మాధ్యమంలో ఉన్నది తొలగించమని స్పష్టం చేసింది. తమకు చైనా తో కానీ, ఇతర ఏ ప్రభుత్వం తో కానీ ఒప్పందాలు లేవని పేర్కొంది.

Next Story