హైదరాబాద్: అమీర్ పేట్ ప్రమాదాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెచ్చులూడి పడటంపై..మౌనిక మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, సౌకర్యాలను పరిశీలిచాలని ఆదేశించారు. దురదృష్టకర ఘటనలు జరగకుండా పునరావృతం కాకూడదన్నారు. హైదరాబాద్‌లో భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంత్రి కేటీఆర్ సలహా ప్రకారం..బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఎల్ అండ్ టీ అధికారులు నిర్ణయించారు. మౌనిక కుటుంబంతో చర్చించిన తరువాత రూ.20లక్షల పరిహారం చెల్లించే ఒప్పందంపై ఎల్ అండ్ టీ అధికారులు సంతకం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.