పీఆర్పీలా జ‌న‌సేన కూడా కాల‌గ‌ర్భంలో..

By Newsmeter.Network  Published on  16 Jan 2020 1:27 PM GMT
పీఆర్పీలా జ‌న‌సేన కూడా కాల‌గ‌ర్భంలో..

తాడేప‌ల్లి : బీజేపీ, జనసేన పొత్తుపై స్పందించాల్సిన అవసరం లేదని, గత ఎన్నికల్లో రెండు పార్టీలు ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతూ.. ఒక్కొరకంగా ప్రభావితం అవుతారని, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతామంటే తమకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్న‌ పవన్ వ్యాఖ్య‌లు గుర్తు చేశారు. మ‌రీ ఈ రోజు ఆపార్టీ ఏమైనా ప్రెష్ ల‌డ్డూలు పంపారేమో న‌ని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా పవన్‌ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని అంబటి ప్రశ్నించారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణించాయని గుర్తుచేశారు.

2019లో మాత్రం టీడీపీతో పవన్‌ లాలుచీ ఒప్పందం చేసుకుని వామపక్షాలతో కలిసి పోటీ చేశారని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వచ్ఛమైన పాలన చేస్తుంటే పవన్‌ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. 7 నెలల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదని చెప్పారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లాంటి వాళ్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీలోకి పంపారన్నారు. వామపక్షాలుకు బాకీ కాదన్న పవన్ మరీ చంద్రబాబుకు బాకీ ఉన్నారా అని ప్రశ్నించారు. స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని విమర్శించారు. సిద్ధాంతాలు లేక పీఆర్పీలా జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందన్నారు.

Next Story