తాడేపల్లి: కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని చెప్పి ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాలు చెప్పే సమయంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పార్టీ మనిషి చనిపోతే మిగతా నాయకుల్లో బాధ, భావోద్వేగం కనిపిస్తాయి..చంద్రబాబులో మాత్రం ఇవి కనిపించడం లేదన్నారు అంబటి. కోడెల మరణంతో చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం తెగ ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా కోడెల ఆత్మహత్యయత్నం చేశారు..అప్పుడే చంద్రబాబు పోరాటం చేసి ఉంటే ఆయన బతికేవారన్నారు. కోడెల విషయంలో చంద్రబాబే చట్టప్రకారం చర్యలు తీసుకోమన్నారని..ఇప్పుడేమో గవర్నర్‌ను కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. కోడెల కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు చేశారు కాని..విచారణ జరపలేదన్నారు. కోడెల తీసుకెళ్లింది లక్ష రూపాయల పర్నీచర్‌ కాదు..కొత్త అసెంబ్లీ పర్నీచర్‌ కాదు..హైదరాబాద్‌ అసెంబ్లీలోని పురాతనమైన పర్నీచర్‌ అని చెప్పారు. కోటి రూపాయలు విలువచేసే 114 వస్తువులు కోడెల తీసుకెళ్లారని  అంబటి మీడియాకు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.