అమెజాన్ సంచలన నిర్ణయం

By రాణి  Published on  14 Dec 2019 11:24 AM GMT
అమెజాన్ సంచలన నిర్ణయం

వరల్డ్ బిగ్గెస్ట్ ఆన్ లైన్ సెల్లర్ అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. జెఫ్ బెజోస్ సారధ్యంలో నడుస్తున్న అమెజాన్.. ఆన్ లైన్ ద్వారా అమ్మే వస్తువులను ఇకపై తామే సరఫరా చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో అమెజాన్ వస్తువులను వినియోగదారుడికి సరఫరా చేసే కొరియర్ సంస్థలకు పెబ్బ ఎదురుదెబ్బ తగలనుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఆర్డర్లను తామే సరఫరా చేసుకునే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది. అమెజాన్ సొంత సరఫరా సంస్థ అయిన అమెజాన్ లాజిస్టిక్స్ త్వరలోనే యూపీఎస్, ఫెడెక్స్ వంటి దిగ్గజాలను క్రాస్ చేస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసి మరీ చెప్తుంది.

ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ 2.5 బిలియన్ డెలివరీలను చేస్తుండగా, ఫెడెక్స్ మూడు బిలియన్లు, యూపీఎస్ 4.7 బిలియన్లను సరఫరా చేస్తోంది. అయితే 2022 నాటికి అమెజాన్ సంస్థ తన డెలివరీలను 6.5 బిలియన్లకు చేరుకోనుందని విశ్లేషకుల అంచనా. అమెజాన్ లాజిస్టిక్స్ డెలివరీల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు రెట్లు పెరిగి 20 -46 శాతానికి చేరుకుందట. ఇకపై సొంత లాజిస్టిక్స్ ద్వారానే అమెజాన్ డెలివరీలు చేయడం మొదలుపెడితే ఇతర కొరియర్ సంస్థలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఈ నిర్ణయంతో ఇతర కొరియర్ సంస్థల లావాదేవీలు పడిపోయే ప్రమాదం లేకపోలేదనే చెప్పాలి.

Next Story