విక్ట‌రీ వెంక‌టేష్ – యువ సామ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ “వెంకీ మామ‌”. ఈ సినిమాకి “జై ల‌వ‌కుశ” ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న రాలేదు.

ఆ త‌ర్వాత దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత దీపావ‌ళి కూడా కాదు డిసెంబ‌ర్ లో రిలీజ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. డిసెంబ‌ర్ లో “భీష్మ” సినిమాతో నితిన్, “డిస్కోరాజా” సినిమాతో ర‌వితేజ‌, “ప్ర‌తిరోజు పండ‌గే” సినిమాతో సాయితేజ్, “96” మూవీతో శ‌ర్వానంద్ ప్రేక్ష‌కుల ముందుకు రావాలి అనుకుంటున్నారు. ఈ విధంగా డిసెంబ‌ర్ లో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ఎక్కువుగా ఉంది.

ఇలాంటి టైమ్ లో “వెంకీ మామ” డిసెంబ‌ర్ లో వ‌స్తున్నాడు అని తెలిసిన‌ప్ప‌టి నుంచి డిసెంబ‌ర్ లో త‌మ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్న యువ హీరోలు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. ఇదిలా ఉంటే… లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… “వెంకీ మామ” డిసెంబ‌ర్ లో కాకుండా సంక్రాంతికి రావాలి అనుకుంటున్నాడ‌ట‌. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంక్రాంతికి వ‌స్తున్న “స‌రిలేరు నీకెవ్వ‌రు”, “అల‌.. వైకుంఠ‌పుర‌ములో…” టీమ్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మొత్తానికి “వెంకీ మామ” ఈ విధంగా టెన్ష‌న్ పెడుతున్నాడు. మ‌రి.. “వెంకీ మామ” రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో… ఈ టెన్ష‌న్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాలి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort