విడాకుల విషయంలో అమలాపాల్ క్లారిటీ
By Newsmeter.Network Published on 18 Feb 2020 1:37 PM ISTహీరోయిన్ అమలా పాల్, దర్శకుడు ఏ.ఎల్ విజయ్ విడాకుల గొడవ ఇప్పటికీ కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌనే. వీరిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. కాగా.. అమల, విజయ్ విడిపోవడానికి అసలు కారణం సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుషేనంటూ ఏ.ఎల్ విజయ్ తండ్రి అళగప్పన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
‘అమల, విజయ్ విడిపోవడానికి కారణం ధనుషే. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్‌పై ‘అమ్మ కనక్కు’ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇందులో అమలా పాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అమలకు కూడా చెప్పాడు. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని అమల నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే ధనుష్ ఈ ఆఫర్‌ను అమలకు ఇవ్వడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పింది. ముందు సినిమాలు చేయనని చెప్పి ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాకు ఓకే చేయడం విజయ్‌కు నచ్చలేదు. దాంతో వారి దాంతప్య జీవితాల్లో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు’ అని వెల్లడించారు.
కాగా.. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై అమలాపాల్ స్పందించారు. తన విడాకుల సంగతి ఇప్పుడు అనవసరం అని పేర్కొంది. అది తన వ్యక్తిగత విషయమని, విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, అందుకు వేరెవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చింది. నటుడు ధనుష్ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పింది. ఈ విషయంపై ఇంకేమీ తనను అడగవద్దు అని, ఇంతకు మించి మాట్లాడటానికి తనకు ఇష్టం లేదంది.
విడాకుల తరువాత అమలాపాల్ నటనపై దృష్టి పెట్టగా విజయ్ దర్శకత్వంపై నిమగ్నమయ్యారు. ఇటీవల ఆయన ఒక వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. నటి అమలాపాల్ కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటార’న్న ప్రశ్నకు అందుకు ఇంకా సమయం ఉందని, తాను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి వెల్లడిస్తానని అమలాపాల్ తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ భామ యాక్షన్ హీరోయిన్‌గా నటించిన ‘అదో అందపరవై పోల’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో మకాం పెట్టడానికి సిద్ధమవుతోంది. సంచలన దర్శకుడు మహేశ్‌భట్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పర్వీన్ బాబీ’ బయోపిక్‌లో అమలాపాల్ నటించనుంది.