మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు

By సుభాష్  Published on  7 Oct 2020 3:51 AM GMT
మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు

ఒక మహిళపై సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని స్పెషల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన దోషులు చనిపోయేంత వరకు జైలులోనే ఉండాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మైనర్‌పై జువైనల్‌ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనను వీడియో తీసి షేర్‌ చేసిన మరో వ్యక్తికి కనీసం ఐదేళ్లు జైలులో ఉండాలని తెలిపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హన్రాజ్‌గర్జర్‌, అశోక్‌ గుర్జర్‌, ఛోతేలాల్‌ గుర్జర్‌, ఇంద్రజ్‌ గుర్జర్‌లను దోషులుగా నిర్ధారించారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దోషులపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఎస్‌సీ, ఐటీ యాక్టులలోని రిలవెంట్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కుల్దీప్‌ జైన్‌ చెప్పారు. పదేపదే లైంగిక దాడికి పాల్పడిన హన్స్‌రాజ్‌పై అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.

కాగా, 2019 ఏప్రిల్‌ 26న 19 ఏళ్ల మహిళపై తన భర్త ముందే ఒక మహిళను నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం డబ్బులు దోచుకున్న సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని తనగజి ఆల్వార్‌ జైపాస్‌లో జరిగింది. ఈ ఘటన నిందితులపై ఎఫ్‌ఆర్‌ నమోదైంది. అయితే నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ మే 2న ఆలస్యంగా నమోదైంది. 2019 మే 18న నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితులంతా 25 సంవత్సరాల్లోపు వారే ఉన్నారు. ఈ కేసులో 32 మంది సాక్షులను కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.

అల్వార్‌ గ్యాంగ్‌రేప్‌ దోషులను చనిపోయే వరకు జైలులోనే ఉండాలని ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్వాగతించారు. కేసు విచారణ వేగవంతంగా పూర్తి చేసి శిక్ష శిధించడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణఅని ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా, దేశంలో ఇలాంటి నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి విషయాల్లో చట్టాలు ఎంత కఠినతరం చేసినా కామాంధుల్లో తీరు మారడం లేదు. అత్యాచారాలు,హత్యలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరినప్పుడల్లా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వెంటనే ఉరి తీయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story