బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి సీతారామరాజు

By సుభాష్  Published on  7 May 2020 12:19 AM GMT
బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి సీతారామరాజు

ముఖ్యాంశాలు

  • నేడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు వర్థంతి

  • స్వాతంత్ర్యం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం

  • బ్రిటిషర్లకు నిద్రలేకుండా చేసిన అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నతమైన శక్తి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడు. రెండు సంవత్సరాల పాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి. 1924 మే 7వ తేదీన ఆయన మరణించారు. నేడు ఆయన 95వ వర్థంతి సందర్భంగా అల్లూరిని స్మరించుకుంటూ న్యూస్‌మీటర్‌ ప్రత్యేక కథనం.

అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన వ్యక్తి. దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్‌ సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నారు.

alluri sitarama raju

అల్లూరి 1897 జూలై 4వ తేదీన పాండ్రంగి గ్రామంలో వెంటక రామరాజు - సూర్యనారాయణమ్మలకు జన్మించారు. అల్లూరి పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో.

9వ తరగతి వరకూ చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం విలువిద్య, గుర్రపుస్వారీలో మంచి ప్రావీణ్యం కలిగిన వీరుడు.

1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మొదటిసారిగా దాడి చేశారు. 23న కృష్ణదేవీపేట పోలీస్‌స్టేషన్‌, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ మూడు పోలీస్‌ స్టేషన్‌లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకుని విప్లవం ప్రారంభించారు. ఆ నాటి నుంచి వసరుగా పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్‌ అధికారుల గుండెల్లో దడ పుట్టించారు అల్లూరి. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యంలో అల్లూరి సీతారామారాజు అనుచరులను చంపేసింది.

ఇక బ్రిటిష్‌ సర్కార్‌ మన్యం ప్రజలను చంపేయడం మొదలు పెట్టింది. ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్న తీరును చూడలేక అల్లూరి సీతారామరాజు త్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7వ తేదీన విశాఖ జిల్లా మంప గ్రామానికి దగ్గరలో రాజు స్వయంగా లొంగిపోయారు.

ఇక పగతో రగిలిపోతున్న బ్రిటిష్‌ అధికారులు అల్లూరిని చింతచెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. మే 8వ తేదీన అల్లూరి అనుచరులు ఆయన భౌతికకాయన్ని కృష్ణదేవీపేటకు తీసుకువచ్చి దహన క్రియలు నిర్వహించారు.

Next Story