అర్హ లా వెళ్లేందుకు నాకు 23 ఏళ్లు పట్టింది : అల్లు అర్జున్
By రాణి Published on 6 March 2020 11:42 AM IST
ఎంత స్టైలిష్ స్టార్ అయినా..పిల్లలకు మాత్రం తండ్రే కదా. అందుకే తన గారాలపట్టీ అల్లు అర్హ ను చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. అప్పుడుప్పుడూ కూతురు తనతో ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు అల్లు అర్జున్. ఇటీవల కూడా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కన్న తండ్రిని బే అంటావా బే అంటే..అవును బే అని అర్హ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ఆ వీడియోలో..
విషయానికొస్తే..యంగ్ హీరో నిఖిల్ హీరోగా..అల్లు అరవింద్, సుకుమార్, బన్నీ వాసు సంయుక్త నిర్మాతలుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 18 పేజీస్. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమవ్వగా..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ గారాలపట్టీ అల్లు అర్హ హాజరైంది. నిఖిల్ పై క్లాప్ కొట్టి..సినిమాను ప్రారంభించింది అర్హ. ఈ సందర్భంగా హీరో నిఖిల్ 'అర్హ.. మా ముహుర్తం ఫంక్షన్ చీఫ్‌గెస్ట్' అంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. 'నిఖిల్ కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఈ వయసులో ఓ సినిమాకు గెస్ట్‌గా వెళ్లడం అర్హ అదృష్టం. నేను ఒక సినిమాకు గెస్ట్‌గా వెళ్లడానికి 23 ఏళ్లు పట్టింది' అన్ని ట్వీట్ చేశాడు.
https://telugu.newsmeter.in/allu-arjun-tweet-about-his-daughter/