హైదరాబాద్ :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటి కోసం భూమి పూజా చేశారు.సాధారణంగా తన రెగ్యులర్ లైఫ్ ని స్టైలిష్ గా డిజైన్ చేసుకునే బన్నీ కొత్త ఇంటి విషయంలో కూడా అలాంటి ప్రణాళికలతోనే సిద్దమైనట్లు సమాచారం. తన ఫ్యామిలీతో కలిసి భూమి పూజ చేసిన అల్లు అర్జున్ అభిమానులతో ఆ ఫోటోని షేర్ చేసుకున్నాడు. ఇంత‌కీ తన కొత్త ఇంటికి అల్లు అర్జున్ ఏమ‌ని పేరు పెట్టారో తెలుసా..? బ్లెస్సింగ్ అని నామకరణం చేశాడు.కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న అల్లు అర్జున్ కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.