స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ప్రేమను నెటిజన్లతో పంచుకున్నారు. అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా..బన్నీ సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ..పెళ్లినాటి ఫొటోను జత చేశారు.

”తొమ్మిదేళ్ల మన వివాహ బంధం. సమయం చాలా వేగంగా పరుగెడుతోంది. కానీ మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం ప్రతిరోజూ పెరుగుతోంది” అని బన్నీ పేర్కొన్నారు. పెళ్లి రోజు సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోను బన్నీ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ”పెళ్లి రోజు శుభాకాంక్షలు. జీవితంతో ఎంతో విలువైన బహుమతులను (అయాన్, అర్హ) నాకు అందించినందుకు థ్యాంక్యూ క్యూటీ” అని పేర్కొన్నారు.

కొంతకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ..2011లో పెద్దల అంగీకారంతో పెళ్లితో ఒక్కటయ్యారు. 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. కాగా..అలవైకుంఠపురములో సినిమాతో విజయాన్నందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

Allu Arjun Wedding Anniversary

అర్హ లా వెళ్లేందుకు నాకు 23 ఏళ్లు పట్టింది : అల్లు అర్జున్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.