తనపై ఉన్న ప్రేమ రోజు రోజుకీ పెరుగుతుంది : అల్లు అర్జున్
By రాణి Published on 6 March 2020 1:15 PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ప్రేమను నెటిజన్లతో పంచుకున్నారు. అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా..బన్నీ సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ..పెళ్లినాటి ఫొటోను జత చేశారు.
''తొమ్మిదేళ్ల మన వివాహ బంధం. సమయం చాలా వేగంగా పరుగెడుతోంది. కానీ మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం ప్రతిరోజూ పెరుగుతోంది'' అని బన్నీ పేర్కొన్నారు. పెళ్లి రోజు సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోను బన్నీ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ''పెళ్లి రోజు శుభాకాంక్షలు. జీవితంతో ఎంతో విలువైన బహుమతులను (అయాన్, అర్హ) నాకు అందించినందుకు థ్యాంక్యూ క్యూటీ'' అని పేర్కొన్నారు.
కొంతకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ..2011లో పెద్దల అంగీకారంతో పెళ్లితో ఒక్కటయ్యారు. 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. కాగా..అలవైకుంఠపురములో సినిమాతో విజయాన్నందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.
https://telugu.newsmeter.in/allu-arjun-tweet-about-his-daughter/