నిర్మాణ రంగంలోకి అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు.. ఫ‌స్ట్ మూవీ ఎవ‌రితోనో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 10:15 AM GMT
నిర్మాణ రంగంలోకి అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు.. ఫ‌స్ట్ మూవీ ఎవ‌రితోనో తెలుసా..?

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలు నిర్మించారు. నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రెండో కొడుకు బ‌న్నీ స్టార్ హీరోగా భారీ చిత్రాలు చేస్తుంటే... మూడో కొడుకు శిరీష్ చిన్న సినిమాలు చేస్తూ త‌న‌ని తాను ఫ్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే... ఇప్పుడు పెద్ద కొడుకు అల్లు వెంక‌టేష్ కూడా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. అవును... నిర్మాత‌గా మారి తొలి చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు.

Varun Tej New Movie

ఇంత‌కీ హీరో ఎవ‌రంటారా..? వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. ఈ ఏడాది 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' చిత్రాలతో సూప‌ర్‌ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభ‌మైంది.

Varun Tej New Movie

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ బ్యాన‌ర్స్ పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అర‌వింద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద క‌లిసి హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కిరణ్ కొర్ర‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు

Varun Tej New Movieఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్రపాటి మాట్లాడుతూ - ''అల్లు అరవింద్‌గారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేష్ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిచ్చే వ‌రుణ్ తేజ్‌గారు క‌థ విన‌గానే వెంట‌నే ఓకే చెప్పారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వ‌రుణ్ గారు చాలా మేకోవ‌ర్ అయ్యారు. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం , జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేష్‌ గారు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. సినిమాలోని మిగ‌తా న‌టీనటులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం'' అన్నారు.

Varun Tej New Movie

ఈ చిత్రానికి సాంకేతిక వ‌ర్గం: సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి.విలియ‌మ్స్‌, మ్యూజిక్‌: త‌మ‌న్‌.ఎస్‌, ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌ , నిర్మాత‌లు: సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేష్‌, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ కొర్ర‌పాటి.

Varun Tej New Movie

Next Story
Share it