అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
By రాణి Published on 12 April 2020 8:23 PM ISTతెలంగాణలో రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30కి పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. తాజాగా కరోనా కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. మే లో జరగాల్సి ఎంసెట్ ప్రవేశ పరీక్షతో సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.
Also Read : ఎలక్షన్ కమిషనర్ కు క్వారంటైన్ వర్తించదా ?
అదేవిధంగా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకునేందుకు మే 5వ తేదీ వరకూ గడువును పెంచుతున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్న కేసీఆర్ చెప్పిన విషయం విధితమే. మరోవైపు ఏపీలో కూడా ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో కరోనా కేసులు 500 దాటింది. మృతుల సంఖ్య 14కు చేరింది. కరోనా వైరస్ సమూహ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ తప్ప మరో దారి లేకపోవడంతో తెలంగాణ సహా 7 రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి.