నైరోబీ అనంతపురం మహిళగా.. తెలుగులో మాట్లాడుతూ ఉంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 5:15 AM GMT
నైరోబీ అనంతపురం మహిళగా.. తెలుగులో మాట్లాడుతూ ఉంటే..

నెట్ ఫ్లిక్స్ లో 'మనీ హైస్ట్' అనే వెబ్ సిరీస్ బాగా ఫేమస్. ప్రొఫెసర్ అనే వ్యక్తి తన టీమ్ ద్వారా పెద్ద దొంగతనానికి స్కెచ్ వేయడం. తాను తప్పించుకుంటూ.. తన టీమ్ ను తప్పించడం ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ. వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ గా చెబుతూ ఉంటారు. ఈ దొంగల జట్టులోని వాళ్లందరినీ పెద్ద పెద్ద నగరాల పేరుతో పిలుస్తూ ఉంటారు. టోక్యో, నైరోబీ, డెన్వర్... ఇలా ఒక్కో దొంగకు ఒక్కో పేరు.

నైరోబీ క్యారెక్టర్ లో అల్బా ఫ్లోరెస్ అనే నటి యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైరోబీ.. తన కెరీర్ స్టార్టింగ్ లో తెలుగు మహిళగా నటించింది. నిజం ఆమె తెలుగులో కూడా డైలాగ్స్ చెప్పింది. ఇంతకూ ఆ సినిమా ఏమిటనే కదా.. 'విన్సెన్ట్ ఫెర్రర్' అనే ఫ్రెంచ్ మూవీ లోనిది.

విన్సెన్ట్ ఫెర్రర్ గురించి అనంతపురం జిల్లాలో చాలా మందికి తెలుసు. స్పెయిన్ దేశస్థుడైన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంకు వచ్చి.. ఇక్కడి ప్రజల కోసం ఆసుపత్రి, స్కూల్స్ కట్టిస్తాడు.. అలా ఆయన ఇక్కడి వాళ్లకు మంచి చేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఎదురైన అవాంతరాలన్నిటినీ ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో 'షమీరా' అనే అనంతపురం అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో డైలాగ్ లను కూడా చెప్పింది. 2013లో వచ్చిన ఈ సినిమాలో అల్బా ఫ్లోరెస్ నటించడం.. ఆమె తెలుగు డైలాగ్స్ చెప్పడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మా నైరోబీ తెలుగు మాట్లాడింది.. తెలుగు డైలాగ్స్ చెప్పింది అంటూ పలువురు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ లో మా నైరోబీ ఇంత మంచి పాత్రలు చేసిందా అని అందరూ షాక్ అవుతున్నారు.

Next Story