'అల‌... వైకుంఠ‌పుర‌ములో'.. ఫ‌స్ట్ సాంగ్ ఎలా ఉంటుందో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 7:54 AM GMT
అల‌... వైకుంఠ‌పుర‌ములో.. ఫ‌స్ట్ సాంగ్ ఎలా ఉంటుందో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'అల‌... వైకుంఠ‌పుర‌ములో'. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గీతా ఆర్ట్స్ , హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నాయి. హైద‌రాబాద్ లో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Image result for ala vaikuntapuramlo

అయితే... ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' సాంగ్. దీనిని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసింది. ఈ పాట‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా... త‌మ‌న్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ స్వ‌ర‌ప‌రిచారు. దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Related image

బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు స‌క్సెస్ సాధించ‌డంతో తాజా చిత్రం 'అల‌.. వైకుంఠ‌పుర‌ము'లో కూడా సక్సెస్ అవుతుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఈ చిత్రం ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

Next Story
Share it