అల... వైకుంఠపురములో.. ఫస్ట్ సాంగ్ అదిరిందిగా..!
By న్యూస్‌మీటర్ తెలుగు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అల.. వైకుంఠపురములో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అల.. వైకుంఠపురములో.. చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
ఆ చూపులనలా తొక్కుతూ వెళ్లకు దయలేదా అసలు..
నీ కళ్లకు కావాలి కాస్త కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగకంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఊయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టెస్తే అలా నిట్టూర్చవటే నిట్ఠురపోవే విల విలలు
సామజ వరగమన .. నిను చూసి ఆగగలనా !
అంటూ సాగే ఈ పాట.. ప్రేయసి పూజా హెగ్డేని ప్రసన్నం చేసుకోవడానికి హీరో బన్నీ పాడతాడని తెలుస్తుంది. విన్న వెంటనే..నచ్చేసి.. మళ్లీ మళ్లీ వినాలపిస్తున్న ఈ మెలోడీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడగా, తమన్ సంగీతాన్ని అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఈ పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ కి యూట్యూబ్ లో అప్పుడే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.