• ‘అల వైకుంఠపురంలో’ టెన్ డేస్ కలెక్షన్స్ !

స్టైలిష్ అండ్ డాన్సింగ్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ అండ్ మెచ్యూర్డ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులందరికీ ఈ చిత్రం బాగా నచ్చడంతో మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనే బిరుదును కూడా మొదటి రోజే దక్కించుకుంది. కాగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసి.. బయ్యర్లకు లాభాల సిరులను పోస్తోంది.

ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆల్-టైమ్ టాప్ తెలుగు సినిమా వసూళ్ల జాబితాలో బాహుబలి సిరీస్ తరువాత ‘అల వైకుంఠపురంలో’ రెండో ప్లేస్ లో నిలిచింది. మరోవైపు బన్నీ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది.

ప్రాంతాల వారీగా 10 రోజుల కలెక్షన్స్
నైజాం – 35.69 కోట్లు
వైజాగ్ – 18.80 కోట్లు
కృష్ణా – 8.80 కోట్లు
గుంటూరు – 9.93 కోట్లు
సీడెడ్ – 18.07 కోట్లు
నెల్లూరు – 4.07 కోట్లు
ఈస్ట్ – రూ.9.89 కోట్లు
వెస్ట్ – రూ.7.65 కోట్లు

ఏపీ & తెలంగాణలో ఈ సినిమాకి మొదటి పది రోజులకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం 112.90 కోట్లుగా వున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ‘అల వైకుంఠపురములో’కి వచ్చిన కలెక్షన్స్ మొత్తాన్ని పరిశీలిస్తే..

యూఎస్ – రూ.12.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ – రూ.3.55 కోట్లు
కర్ణాటక – రూ.10.70 కోట్లు
తమిళనాడు అండ్ కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.3.60 కోట్లు
అల వైకుంఠపురంలో సినిమా విడుదలైన 10 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ రూ.143.25 కోట్లు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.