టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ కుమార్
By సుభాష్ Published on 6 Jun 2020 8:17 AM ISTగత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ వార్షిక జాబితా విడుదలైంది. ఈ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషకం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2020 వరకూ దాదాపు రూ.366 కోట్ల సంపాదనతో ఈ బాలీవుడ్ కిలాడీ ప్రపంచంలో అత్యధిక రాబడి కలిగిన టాప్ 100 సెలబ్రిటీల సరసన నిలిచాడు. అమెరికాకు చెందిన కైలీ జెన్నర్ రూ.4453 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలువగా, అక్షయ్ కుమార్‌కు 52వ స్థానం తక్కింది. (ఇది చదవండి: రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్)
అయితే సంవత్సరం సంపాదన రూ.490 కోట్ల అయితే .. బాలీవుడ్ సూపర్‌స్టార్ సంపదపై కోవిడ్-19 ఎఫెక్ట్ పడిందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ఫోర్బ్స్ జాబితాలో టాప్10లో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా కైలీ జెన్నర్, కన్యేవెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనోరొనాల్డ్, లియోనెల్, టేలర్ పెర్రీ, నేమార్, హోవర్డ్‌స్టెమ్, లెబ్రాన్ జేమ్స్, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు.
కాగా, ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'ఫృథ్వీరాజ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్ష్మీబాంబ్, సూర్యవన్షి సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి.