మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై కేసు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 9:25 AM GMT
మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై కేసు..!

ఆళ్లగడ్డ: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై ఆళ్లగడ్డ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కొండాపురంలో ఉన్న క్రషర్ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో కేసు నమోదైంది. క్వారీ యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదుతో భార్గవ్ రామ్‌తోపాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్ రామ్ బెదిరించినట్లు శివారామిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్గవ్ రామ్‌ పీఏను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

భార్గవ్ రామ్‌తో పాటు.మరో 10 మంది పై కూడా కేసులు నమోదయ్యాయి. 1. మాదల శ్రీను 2. నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి 3. శ్రీను 4. అల్లా సుబ్బయ్య 5.నాగేంద్ర 6. డ్రైవర్ గణేష్ 7. మంగలి పవన్ 8. పీఏ మహేష్ 9. సంపత్ నాని 10 షరీఫ్ లపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Next Story
Share it