అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో  చేస్తోన్న  సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.  అఖిల్ సరసన ఈ సినిమాలో  హీరోయిన్ గా  పూజా హెగ్డే  నటిస్తోంది. అయితే  లాస్ట్ షెడ్యూల్ లో  చిత్రబృందం ఈ సినిమాలోని  ఓ రొమాంటిక్  సాంగ్ తో పాటు  అఖిల్ – పూజా  హెగ్డేల మధ్య   లవ్ సీన్స్ ను కూడా షూట్ చేశారు.  లవ్ సీన్స్  లో   అఖిల్ – పూజా హెగ్డే  మధ్య  కెమిస్ట్రీ   చాల బాగా కుదిరిందని..  వీరి మధ్య రొమాన్స్  సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్ – పూజాకి మధ్య లిప్ టు లిప్ కిస్ ఉంటుందట. మొత్తానికి పూజా  హెగ్డే  తన అందాలను ఆరబోయటంలో ఎలాంటి హద్దు అదుపు లేకుండా  ఈ సినిమాలో  రెచ్చిపోయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో  ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా కూడా  బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే  బలమైన  ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఈ  సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తోన్నారు.  మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా  అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడా..?  ఈ సినిమా తరువాత హరీష్ శంకర్  – అఖిల్  కాంబినేషన్ లో  ఓ  సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  అఖిల్  కోసం  స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట హరీష్ శంకర్. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. 
అయితే ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి .  దాంతో తన తరువాత సినిమాల  పై మరింత జాగ్రత్త  పడుతున్నాడు అఖిల్.  బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమాకి కూడా అఖిల్ దగ్గర ఉండి సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడట. 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.