ఫుల్ ఎక్స్ పోజింగ్ కి 'ఐశ్వర్య రాయ్' గ్రీన్ సిగ్నల్.!

By Newsmeter.Network  Published on  14 Jan 2020 2:39 AM GMT
ఫుల్ ఎక్స్ పోజింగ్ కి  ఐశ్వర్య రాయ్ గ్రీన్ సిగ్నల్.!

క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరేట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. జనవరి మూడో వారం నుండి ఐష్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనుందట. వాటిలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర అట. అన్నట్టు ఈ పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని కూడా తెలుస్తోంది.

మొత్తానికి ఐశ్వర్య రాయ్ రోల్ బాగా ఎగ్జైటింగా ఉండబోతుందట. పైగా నందిని పాత్ర వెరీ బోల్డ్ గా ఉంటుందట. కొన్నిరొమాంటిక్ సన్నివేశాలు కాస్త హాట్ నెస్ తో హద్దు మీరి ఉంటాయని.. ఆ సన్నివేశాల్లో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేయడానికి ఐశ్వర్య రాయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి పని చేయనున్నారు. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తి, విజయ్ సేతుపతి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు.. త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ నటించనున్నారు.

Next Story
Share it