అగ్రి గోల్డ్‌ బాధితులను ఏపీ సీఎం ఆదుకున్నారు: లేళ్ల అప్పిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 11:58 AM GMT
అగ్రి గోల్డ్‌ బాధితులను ఏపీ సీఎం ఆదుకున్నారు: లేళ్ల అప్పిరెడ్డి

అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందని అన్నారు.. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం తొలివిడత రూ.264 కోట్లు, రెండవ విడత రూ. 886 కోట్లు విడుదల చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై బాధితులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ప్రైవేట్ సంస్థ మోసం చేసిన ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని..ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే బాధిలను ఆదుకుందని అప్పిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ…సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ. 1150 కోట్ల రూపాయలను జగన్ విడుదల చేశారని చెప్పారు అప్పిరెడ్డి. చంద్రబాబుది కోతల ప్రభుత్వం అని… జగన్మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం అని చెప్పారు. అయితే ఈ అగ్రిగోల్డ్ కంపెనీ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పుట్టిందని… స్కామ్ కూడా ఆయన హయాంలోనే బయట పడిందని చెప్పారు. అయినా .. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబును కోరితే అరెస్టులు చేయించారని అప్పిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే 300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా అగ్రిగోల్డ్‌ ఆస్తులను టీడీపీ నేతలే కాజేశారన్నారు. కానీ.. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసిందన్నారు. దీనికి కృతజ్ఞతగా ఈ నెల 29 అన్ని అగ్రిగోల్డ్ సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏ అగ్రిగోల్డ్‌ బాధితుడు ఆత్మహత్య చేసుకోవద్దని అప్పిరెడ్డి కోరారు.

Next Story
Share it