ఇండోర్‌: సెంచరీలు అంటే గల్లీ ఆటలో కొట్టేసినట్లు కొట్టేస్తున్నాడు మయాంక్‌. తన బ్యాట్‌ మాయతో పరుగుల వాన కురిపిస్తున్నాడు. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌ తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో మయాంక్‌ అభిమానుల మనసు దోచుకునే సెంచరీ కొట్టాడు. 183 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో సెంచరీ బాదేశాడు. మయాంక్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. 86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈ రోజు ఆటను మయాంక్‌ అగర్వాల్‌-చతేశ్వర్‌ పుజారాలు ఆరంభించారు. ఈ క్రమంలోనే చతేశ్వర పుజారా(54) హాఫ్‌ సెంచరీ తర్వాత అవుటయ్యాడు. మయాంక్‌ మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు.

పూజారా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లి(0) విఫలమయ్యాడు. తాను ఆడిన రెండో బంతికే డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అజింక్యా రహానేతో మయాంక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడంతో భారత్‌ తేరుకుంది. మొదటి రోజు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.