కరడుకట్టిన ఐఎస్ ఐఎస్ లో చేరిన కేరళ మహిళల వివరాలను కేంద్ర ప్రభుత్వం, గుఢచర్ ఏజెన్సీలు సేకరిస్తున్నాయి. ఈ మహిళలు ఇస్లాం మతం స్వీకరించి, తమ తమ భర్తలతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభావ క్షేత్రమైన సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరు అఫ్గనిస్తాన్ కు చేరుకునేసరికి మనసు మారి ఆ దేశంలోని ఖొరాసాన్ ప్రాంత అధికారుల ముందు లొంగిపోయారు.

పోలీసుల కథనం ప్రకారం నిమిష ఫాతిమా అనే మహిళ, ఆమె భర్త విన్సెంట్ సెబాస్టియన్ లు 2015 లో ఇస్లామ్ మతాన్ని స్వీకరించారు. తరువాత ఉగ్రవాద సంస్థల ప్రభావంలోకి వెళ్లారు. గర్భవతిగా ఉండగానే 2016 లో ఆమె, ఆమె భర్త ఐసిస్ లో చేరారు. ఆ తరువాత అఫ్గనిస్తాన్ కు వెళ్లారు. నిమిష ఫాతిమా వృత్తి రీత్యా డెంటిస్టు. ఆమె అఫ్గనిస్తాన్ లో ఉందన్న విషయం ఇటీవలే మన గూఢచర్య సంస్థల దృష్టికి వచ్చింది. వారి ఫోటోలను నిమిష తల్లి బిందు సంపత్ కు చూపించగా, ఆమె కూతురును గుర్తుపట్టింది. నిమిష తో పాటే కేరళలోని కాసర్ గోడ్ కి చెందిన సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయెషా, ఆమె భర్తలు కూడా ఉండి ఉండవచ్చునని గూఢచారి సంస్థలు అనుమానిస్తున్నాయి.

కేరళ నుంచి 2014-16 మధ్య కాలంలో పలువురు ముస్లింలు ఐసిస్ లో చేరారు. ఆ తరువాత వారు అఫ్గనిస్తాన్, సిరియాలను చేరుకున్నారు. కేరళ నుంచే దాదాపు 100 మంది ఐసిస్ లో చేరారని పోలీసులు భావిస్తున్నారు. నిమిష, సోనియాలు కూడా ఈ బృందంలో సభ్యులని వారు అంచనా వేస్తున్నారు. కాసర్ గోడ్, కన్నూర్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పలు ముస్లిం కుటుంబాలు ఐసిస్ లో చేరాయి. వీరంతా ముందుగా శ్రీలంక చేరుకుని, అక్కడ నుంచి సిరియాకు, అఫ్గనిస్తాన్ కు చేరుకున్నారు. నిమిష ఒక కరడుగట్టిన ముస్లిం సంస్థ కాసర్ గోడ్ లో నిర్వహించే డెంటల్ కాలేజీలో చదువుతున్నప్పుడే హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఇస్లామ్ మతంలోకి మారింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.