అర్జున్ రెడ్డి.. చిన్న సినిమాగా రూపొంది పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన సినిమా. ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సందీప్ రెడ్డి ఏకంగా బాలీవుడ్ లో మూవీ చేసే ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం… ఈ సినిమానే బాలీవుడ్ లో రీమేక్ చేయ‌డం.. అక్క‌డ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే. ఇదే సినిమాను త‌మిళ్ లో ఆదిత్య వ‌ర్మ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీశయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆదిత్య వ‌ర్మ టీజ‌ర్ కి పాజిటివ్ గానే స్పంద‌న వ‌స్తుంది. అయితే… ఇందులో కొన్ని మార్పులు చేసిన‌ట్టు తెలిసింది. హీరో క్యారెక్ట‌ర్ లో, అలాగే హీరోయిన్ క్యారెక్ట‌ర్ లో కొన్ని మార్పులు చేసార‌ట‌. హిందీలో మార్పులు చేయ‌లేదు కానీ.. త‌మిళ్ లో నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసార‌ట‌. హీరో ధృవ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాహిద్ లా న‌టించ‌క‌పోయినా.. పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే న‌టించాడు.

తెలుగులో, హిందీలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో త‌మిళ్ లో ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే ఆదిత్య వ‌ర్మ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మ‌రి.. ఈ సినిమా ధృవ్ కి విజ‌యాన్ని అందిస్తుందో..? లేదో..? చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.