అందాలు ఆరబోసే బ్యూటీ చేసిన పనికి కుర్రాళ్లు ఫిదా..

By సుభాష్  Published on  29 May 2020 11:08 AM GMT
అందాలు ఆరబోసే బ్యూటీ చేసిన పనికి కుర్రాళ్లు ఫిదా..

హర్ట్‌ అటాక్‌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, క్షణం, కల్కి, గరం వంటి సినిమాల్లో నటించింది. ఇక అందాలు ఆరబోసినా ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా గట్టెక్కలేకపోయింది. తెలుగులో రాణించలేకనేమో హిందీ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ అందాల భామ. పలు సినిమాల్లో నటిస్తూ, హాట్‌‌, హాట్ షూట్లతో కుర్రాళ్ల మతులు పొగొడుతోంది.

అంతేకాదు అదాశర్మ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తనకు నచ్చిన హాట్‌ హాట్‌ ఫోటోలతో పాటు ఆమె చేసే ప్రయోగాలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అదేంటంటే.. ఒ పల్లెటూరి అమ్మాయిలా మారి బట్టలు ఉతికి ఆరేయడాన్ని కొత్తగా చేసి చూపించింది. అంతేకాదండోయ్‌.. ఉతికిన బట్టలతో మార్షల్‌ ఆర్ట్స్‌ చేసి వావ్‌ అనిపించింది అదా శర్మ. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Next Story