ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూత

By సుభాష్  Published on  19 Oct 2020 11:58 AM IST
ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూత

ప్రముఖ బుల్లితెర నటి జరీనా రోషన్‌ఖాన్‌ (55) కన్నుమూశారు. జరీనాకు రోషన్‌ ఖాన్‌ గుండెపోటుతు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మరణంపై పలువరు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరీనా నటించిన కుంకుమ్‌ భాగ్య సహనటీనటులకు ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఆ సినిమాలో నటించిన పాత్రకు జరీనాకు మంచి పేరు వచ్చింది. టీవీ నటుడు షబీర్‌ అహ్లువాలియా, నటి శ్రీతి జాలు జరీనాతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి నివాళులు తెలిపారు. నటి శ్రద్ద ఆర్య జరీనా మృతితో తాను షాక్‌కు గురయ్యానని, ఆమె మరణం తీరని లేదని తెలిపింది. జరీనా మరణాన్ని నమ్మలేకపోతున్నా.. ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టకముందు 'కుంకుమ్‌ భాగ్య' అని అన్నారు.

జరీనా ఖాన్‌ కుంకుమ్‌ భాగ్య సీరియల్‌తో పాటు ఇతర టీవీ షోలలో సైతం నటించింది. వాటిలో ముఖ్యంగా యే రిష్టాక్యారెహ్లతా హై ఒకటి. ఆమె ఇటు సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరణం పట్ల మరో టీవీ నటుడు అనురాగ్‌ శర్మతన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఈ వయసులో కూడా ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉండేది. నేను అలాంటి వ్యక్తిని ఎన్నడు చూడలేదని అంటూ తన అనుబంధాన్ని పంచుకున్నాడు.

Next Story